Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 9:20 pm Posted by : ramakrishna

తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దు

  • కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర

 

కామారెడ్డి, బతుకమ్మ : జిల్లాలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. తక్కువ వెలుతురు కారణంగా ఎదురు వాహనాలు, పాదచారులు, రహదారి మార్గాలు స్పష్టంగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని తెలిపారు. పొగమంచు కారణంగా చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వాహనదారులు అప్పమత్తంగా ఉండడం, ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించడం అత్యంత కీలకమని తెలిపారు. పొగమంచు ఉన్న సమయంలో వాహనాలను నిదానంగా, శ్రద్ధగా నడపాలన్నారు. హెడ్ లైట్లలో భీమ్ లో ఉంచి పరిస్థితులకు అనుగుణంగా ఫాగ్ లైట్లను ఉపయోగించాలని తెలిపారు. డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం పూర్తిగా మానుకోవాలని సూచించారు.  ఏదైనా అత్యవసర సమయంలో వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.