Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 4:33 pm Posted by : ramakrishna

ఓటీపీ లను ఎవరి తోనూ పంచుకోవద్దు

 

. . . సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై ప్రజలకు సూచనలు చేసిన ఎస్సై

 

రాజంపేట, బతుకమ్మ :

 

సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని ఎన్.రాజు సూచించారు. రాజంపేట బస్టాండ్ చౌరస్తాలో కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, రాజంపేట ఎస్సై ఎన్.రాజు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ కళాబృందం సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించింది. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మైనర్లు వాహనాలు నడపకూడదని, ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ వినియోగం, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై హెచ్చరించారు. సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930, అత్యవసర సమయంలో 100కు కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు, పోలీసు సిబ్బంది, ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.