దళారులకు సోయా విక్రయించొద్దు
బిచ్కుంద, బతుకమ్మ: దళారులకు సోయా విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బిచ్కుందలోని మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సోయాకు రూ.4,982 మద్దతు ధర ప్రకటించిదని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లికార్జున అప్ప, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్, పీసీసీ డెలిగేట్ సభ్యులు విఠల్...