Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 October 2024, 1:47 pm Posted by : ramakrishna

దళారులకు సోయా విక్రయించొద్దు

బిచ్కుంద, బతుకమ్మ: దళారులకు సోయా విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. బిచ్కుందలోని మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సోయాకు రూ.4,982 మద్దతు ధర ప్రకటించిదని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లికార్జున అప్ప, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ధర్పల్లి గంగాధర్, పీసీసీ డెలిగేట్ సభ్యులు విఠల్ రెడ్డి, సిద్ధప్ప పటేల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగనాథ్ పటేల్, సొసైటీ డైరెక్టర్ శివరాజ్ పటేల్, కల్లాలి చంద్రకాంత్ పటేల్, సిరిసముందర్ మాజీ సర్పంచ్ గంగాధర్, ఖాత్గవ్ మాజీ సర్పంచ్ శంకర్, శాంతాపూర్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, బొగడమీది సాయిలు, తదితరులు పాల్గొన్నారు.