సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దు

 ప్రజా ప్రభుత్వంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బతుకమ్మ,మద్నూర్ : సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయరాదుని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. శనివారం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు,మౌలిక సదుపాయాలు తదితర వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని సమస్యలను సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, కావాల్సిన మందులు ప్రజలకు అందుబాటులో...