Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2024, 5:03 pm Posted by : ramakrishna

సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దు

  •  ప్రజా ప్రభుత్వంలో ఆరోగ్యానికి ప్రాధాన్యత
  • ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

బతుకమ్మ,మద్నూర్ : సీజనల్ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయరాదుని ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు. శనివారం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు,మౌలిక సదుపాయాలు తదితర వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని సమస్యలను సిబ్బంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి, కావాల్సిన మందులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వంలో ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు.ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో వైద్య ఆరోగ్యానికి అధిక నిధులు కేటాయించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని అన్నారు.డాక్టర్లు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది తో పాటు మండల అధ్యక్షులు సాయిలు, బస్వరాజ్ పటేల్ ప్రజ్ఞ కుమార్, రాములు, హన్మండ్లు, స్వామి, సాయి పటేల్, రమేష్, అమూల్ తదితరులు పాల్గొన్నారు.

Do not neglect seasonal diseases