Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 January 2025, 6:26 pm Posted by : ramakrishna

బడి ఈడు పిల్లలను పనిలో పెట్టుకోవద్దు

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలం కేంద్రంలో ఆపరేషన్ స్మైల్ -XI భాగంగా బాల కార్మికశాఖ ఆధ్యర్యంలో గురువారం బాల కార్మికులుగా పని చేస్తున్న బాలురకు  అవగాహన కల్పించారు. పలు దుకాణాలలో అడిగి తెలుసుకున్నారు. బడి ఈడు పిల్లలను పనులలో పెట్టుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మండల కేంద్రంలోని కిరాణా దుకాణంలో గంగప్రసాద్ అనే బాలుడు పట్టుబడటం జరిదింది. బాలుడి తల్లిదండ్రులను చైల్డ్ కమిటీ ద్వారా కౌన్సిలింగ్ చేసి జిల్లా పరిషత్ హైస్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి పాఠశాలలో తిరిగి  10వ తరగతిలో అడ్మిషన్ ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సూపర్వెజర్ బాణోత్ బాబు నాయక్, సాధన ఎన్జీఓ ఆర్గనైజేషన్ చరణ్ సింగ్, పోలీసు శాఖ మహేష్,శివ క్రిష్ణ, రిజ్వాన్, షిటీం షౌకత్ బేగం పాల్గొన్నారు.