- దుబ్బాక ఎస్సై వి. గంగరాజు
బతుకమ్మ, దుబ్బాక ప్రతినిధి : దుబ్బాక స్టేషన్ పరిధిలోని పెద్ద గుండవెల్లి గ్రామ శివారులో ఇష్టానుసారంగా వరి ధాన్యాన్ని రోడ్లపై పొయ్యడం వల్ల వాహనాదారులు చాలా ప్రమాదాలకు గురవుతున్నారని, సాధ్యమైనంత వరకు రోడ్లపై ధాన్యాన్ని పోయవద్దు దుబ్బాక ఎస్సై వి. గంగరాజు రైతులకు సూచించారు. రైతులతో మాట్లాడుతూ రోడ్లపై ధాన్యాన్ని పోసి నల్ల కవర్ కప్పడం వల్ల ధాన్యం కుప్ప కనపడక ధాన్యం కుప్పకు ఢీకొని చనిపోయిన సంఘటనలు చాలావరకు జరుగుతున్నాయని అన్నారు. బావి దగ్గర, ఇండ్ల వద్ద లేదా ఇతర ప్రదేశాలలో ధాన్యం పోయడానికి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంగా రోడ్లపై ధాన్యం పోసి అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం కావొద్దు అని తెలిపారు. ఎవరైనా ధాన్యాన్ని రోడ్లపై నిర్లక్ష్యంగా పోస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.