Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 8:33 pm Posted by : ramakrishna

శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదు

 

. . . చట్టాన్ని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జిల్లాలో హోలీ పండుగ సందర్భంగా ప్రజలు నిబంధనలు పాటించాలని ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని కొంత మంది హోలీ పండుగ సందర్భంగా వివిధ రకాల రహదారులలో, బహిరంగ ప్రదేశాలలో వారికి ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని చల్లడం లేదా ఇష్టపడని వ్యక్తులపై రంగు పూయడం వల్ల చికాకు కలిగిస్తున్నట్లు పోలీసు వారికి నివేదికలు అందాయని పేర్కొన్నారు. వీధుల్లో, బహిరంగ ప్రదేశాలలో గుంపుగా ద్విచక్ర వాహనాలు, నగరంలో రహదారులు, బహిరంగ ప్రదేశాలలో ఇష్టపడని వ్యక్తులు, ప్రదేశాలు, వాహనాలపై రంగులు లేదా రంగు నీటిని చల్లడం లేదా ఇష్టపడని వ్యక్తులపై రంగు పూయడం నిషేదించామని తెలిపారు. ఎవరైనా ఈ ఆదేశాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.