బీబీపేట్, బతుకమ్మ : కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని ఉమ్మడి జిల్లా వైస్ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. బీబీపేట్ మండల కేంద్రంలో బుధవారం ధాన్యం కొనుగోల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు సెంటర్ ను ప్రతి దగ్గర ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతు నుండి జాలి పట్టి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సన్న వడ్లు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భూమా గడుమాజీ, జిల్లా వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, మాజీఎంపీపీ బాలమణి, మాజీ ఎంపీటీసీ టుకొరివి నీరజ నరసింహులు, సొసైటీ డైరెక్టర్ దేవుని పల్లె శీను, మల్లేశం, వెంకట్, ఆముదాల నరేందర్, మాజీ సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ, గాడి లింగం, పర్ష గౌడ్, యాడారం సర్పంచ్ వెంకటి, ఎమ్మార్వో తదితరులు పాల్గొన్నారు.