పచ్చి పసుపు మార్కెట్ కు తేవొద్దు
నిజామాబాద్, బతుకమ్మ: పచ్చి పసుపును మార్కెట్ యార్డుకు తీసుకురావొద్దని, పూర్తిగా ఆరిన తరువాత తీసుకువస్తే రైతులు లాభాలు పొందొచ్చని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. పసుపు సాగు చేసిన రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ప్రచార యాత్ర వాహనాలను భూపతిరెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ – నామ్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. పచ్చి పసుపునకు సరైన ధర...