భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో తాత్సారం చేయొద్దు
జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నవీపేట్ లో ఆకస్మిక తనిఖీలు నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన నవీపేట్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్, అంగన్వాడి కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోడౌన్, ప్రైవేట్ ఎరువుల విక్రయ కేంద్రాలను, వెటర్నరీ సెంటర్, తహసిల్ ఆఫీసు తదితర కార్యాలయాలను...