నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజమాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆరోగ్య కేంద్రం లోని,ఐఎల్ఆర్,డీప్ ఫ్రీజర్ ను పరిశీలించి వ్యాక్సిన్ల నాణ్యతను, ఫ్రిజ్ లోని ఐస్ ప్యాక్లను పరిశీలించారు రికార్డులను, హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులందరూ సమయపాలన పాటించాలని అంకితభావంతో పనిచేయాలని అర్హులైన ప్రతి చిన్నారికి టీకాలు 100 శాతం పూర్తిచేయాలని, అర్హులై ఉండి ఇంకా వ్యాధి నిరోధక టీకాలు తీసుకొని వారిని పేరుపేరునా పరిశీలించి పర్యవేక్షించి టీకాలు ఇవ్వాలని కోరారు. మాతా శిశు ఆరోగ్య సేవలను, గర్భిణీ స్త్రీల నమోదు, వైద్యుని చేత నాలుగుసార్లు పరీక్షలు జరగాలన్నారు. ఐపీ, ఒపీ, ఆరోగ్య మహిళా రికార్డు లను,ఆరోగ్య సేవలు అందరికీ అందేలా చూస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా, అసంక్రమిక వ్యాధులను నిరంతరం పరీక్షిస్తూ చికిత్స అందించాలని, పిహెచ్ స్సి ల వారిగా కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరారు ఇంకా పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ మైత్రి, పర్యవేక్షకురాలు పుష్ప, పిహెచ్స్సి సిబ్బంది పాల్గొన్నారు.