బతుకమ్మ, ఏర్గట్ల: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ గురువారం ఏర్గట్ల మండలము తోర్తి గ్రామం లో ఆత్మీయ కుటుంబాలను పరామర్శించారు.ఇటీవలే అనారోగ్యం వల్ల చనిపోయిన కుండ శారద,ఎంపీ హెచ్ఏ, ( ఎఫ్ ) అలాగే అదే గ్రామానికీ చెందిన నిజాం కాలేజీ మాజీ ప్రిన్సిపల్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ నాయుడు అశోక్ సతీమణి సువర్ణ దేవి,గుండే నొప్పితో అకాలమరణం చెందడము తో వారి కుటుంబసభ్యులను పరామర్శించారు, ఈ సందర్బంగా వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ధైర్యంగా ఉండాలనీ, వారికి మనో ధైర్యాన్ని కల్పించాలని అన్నారు.
