పోచంపాడ్ పీహెచ్ సిని ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

  మెండోరా, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారి డా. రాజశ్రీ సోమవారం పోచంపాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె వ్యాక్సిన్ నిల్వ కోసం ఉపయోగిస్తున్న ఐఎల్ఆర్ ను తనిఖీ చేసి, వ్యాక్సిన్ల నిల్వ, ఉష్ణోగ్రత నిర్వహణ, కోల్డ్ చైన్ విధానాలను పరిశీలించారు. అలాగే పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన రిజిస్టర్లు, వ్యాక్సిన్ స్టాక్ రికార్డులు, ఇతర సంబంధిత నమోదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...