Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2024, 6:32 pm Posted by : ramakrishna

డీజే లకు అనుమతి లేదు

  • మాచారెడ్డి ఎస్ఐ అనిల్

బతుకమ్మ, మాచారెడ్డి:  వినాయక చవితి ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. మాచారెడ్డి ఉమ్మడి మండలంలోని డీజే నిర్వాహకులతో పోలీస్ స్టేషన్లలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డీజే నిర్వాహకులతో మాట్లాడారు. చట్టాన్ని ఎవరు అతిక్రమించిన కోరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. ముందస్తుగా వారిని తాసిల్దార్ ఎదుట బండోవర్ చేసినట్లు తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వారికి ఉత్సవాల నిర్వహణపై తాగిన సూచనలు చేశారు.