Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 October 2024, 6:48 pm Posted by : ramakrishna

పర్మిషన్లు తీసుకున్న వారికే డీజేల అనుమతి

ఇతర రాష్ర్ట, జిల్లా డీజేలకు అనుమతి లేదు

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పర్మిషన్లు తీసుకున్న డీజేలకు జిల్లాలో అనుమతి ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీజే షాపుల  యాజమాన్యం ఆధ్వర్యంలో ఆదివారం పోలీస్ కమిషనర్  కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లడారు.  డీజే షాప్ ల వారు ఈ నెల 30 వరకు లైసెనుసులు , పర్మిషన్లు తప్పకుండ తీసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల, ఇతర జిల్లాల నుండి వచ్చే డీజే లపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఇచ్చిన ఆదేశాలు పాటిస్తూ ప్రజలకు, సీనియర్ సిటిజన్స్ కు, పిల్లలకు ఇబంధులు కలుగకుండా చట్ట పరిధిలో రెండు సౌండ్ బాక్స్ సిస్టమ్ లు వాడుతు ఈ కార్యక్రమం జరుపుకోవాలని సూచించారు. డీజే షాప్ ల యాజమాన్యం ఇతర జిల్లాల, రాష్ట్రాల నుండి వస్తున్న డీజే సిస్టమ్లను నిజామాబాదు జిల్లా వాతావరణం, సౌండ్ సిస్టమ్ బిజినెస్ యాజమాన్యం ను ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు.  ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చి నిజామాబాదు లో ఇబ్బంది పెడుతున్న డీజే వాళ్ళ పై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  పోలీస్ శాఖ పరిమితులకు లోబడి డీజే యాజమాన్యం వ్యవహరించాలని తెలిపారు.