బీబీపేట్ లో డీజే సీజ్ . . . కేసు నమోదు
కామారెడ్డి, బతుకమ్మ : బీబీపేట్ మండల కేంద్రంలో గణేష్ నిర్వాహకులు డీజేను ఉపయోగించడంతో పోలీసులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. గణేష్ నిమజ్జనంకు డీజేను అనుమతి లేదని పోలీసులు సూచించినప్పటికీ బీబీపేట్ గ్రామానికి చెందిన యువకులు డీజే ను ఏర్పాటు చేశారు. దీంతో డీజేను సీజ్ చేసినట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. డీజేలకు దూరంగా ఉండాలని, సాంప్రదాయ డప్పులు, వాయిద్యాలతో గణేష్ నిమజ్జనం నిర్వహించుకోవాలని ఎస్సై సూచించారు.