దీపావళి వసూళ్ల దందా.. నిబంధనలకు నీళ్లు..

 బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద లో జోరుగా దీపావళి వసూళ్ల దందా సాగుతుంది. టపాసుల దుకాణాల ఏర్పాటుకు మామూళ్లు శాఖల వారీగా చెల్లించాల్సిందే. దీంతో వ్యాపారులు నిబంధనలు తుంగలో తొక్కారు. వ్యాపారులు ఫైర్, మున్సిపల్, రెవెన్యూ ,  శాఖలో పనిచేసే కొందరు అధికారులకు మామూళ్లు అందించారు. టపాకాయల విక్రయానికి ఆయా శాఖల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కొందరు బాణాసంచా విక్రయానికి సంవత్సరం అనుమతి పొందుతుంటే మరికొందరు తాత్కాలికంగా అనుమతి తీసుకుంటారు. ఇక్కడే అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. తమిళనాడులోని శివకాశి నుంచి దొడ్డి...