బీఆర్ఎస్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ఆదేశానుసారం రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డి సూచనల మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. దీపావళి సందర్భంగా పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైన వేయాలనుకున్న 18,500 విద్యుత్ చార్జీల భారాన్ని ఆపిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల తరఫున ఈ సంబరాలు నిర్వహిస్తున్నామని  తెలిపారు. పది సంవత్సరాల్లో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచని తమ...