హైదరాబాద్, బతుకమ్మ : ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్ గా దివ్య దేశ్ ముఖ్ నిలిచారు. ఆమె ప్రత్యర్థి కోనేరు హంపిపై విజయం సాధించారు. ఫైనల్స్ లో వీరిద్దరి మధ్య జరిగిన తొలి ర్యాపిడ్ టై బ్రేకర్ డ్రాగా ముగియగా, రెండో గేమ్ లో మొత్తం 75ఎత్తుల్లో దివ్య విజయం సాధించారు. చివరి ట్రై బ్రేకర్ లో దివ్య తెల్ల పావులతో బరిలోకి దిగారు. 2025 ఫిడీ మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరిన తొలి క్రీడాకారిణిగా ఆమె నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్స్ లో దివ్య 1.5పాయింట్లు, కోనేరు హంపి 0.5 సాధించారు. ఆదివారం జరిగిన మ్యాచ్ ల్లో కోనేరు హంపి తీవ్రమైన పోటీ ఇచ్చారు. దీంతో ఫలితం సోమవారం టై బ్రేకర్ కు చేరింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో దివ్య కూడా దూకుడుగానే ఆడింది. ఓ దశలో హంపీని ఒత్తిడికి గురి చేసింది. తాజా విజయంతో దివ్య గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకున్నారు. దీంతో భారత్ లో ఈ హోదా అందుకున్న 88వ వ్యక్తిగా నిలిచారు.