కాలయాపనలో డిచ్ పల్లి డివిజన్
సిబ్బందితో దాగుడుమూతలు విభజన ఇష్టం లేకనే...! తప్పుల తడకల జాబితా సర్కిల్ లో ఆ ఇద్దరి వల్లే అడ్డు నిజామాబాద్, బతుకమ్మ: విద్యుత్ శాఖలో డిచ్ పల్లి డివిజన్ ను విభజించడం వారికి ఇష్టం లేనట్లుగా ఉంది. అందుకేనేమో రెండేళ్లుగా ఆ ప్రక్రియను కొనసాగింపజేస్తున్నారు. సర్కిల్ అధికారికి మరో అధికారి తోడై గంతకు తగ్గ బొంత అన్నట్లుగా ఓఅండ్ఎం సిబ్బందితో దాగుడు మూతలు అడుతున్నారు. దీనివల్ల కాలయాపన చేస్తూ కావాలనే డిచ్ పల్లి డివిజన్ ను అడ్డుకుంటున్నారనే ఆరోపణలు కాంపౌండ్ లో వినిపిస్తున్నాయి. 6వ తేదీన...