Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 June 2025, 7:56 pm Posted by : ramakrishna

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేదిలేదు

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. ఈనెల 11న  రాత్రి అందాజ మోర్తాడ్ గ్రామానికి చెందిన రొయ్యల సురేష్ మసీద్ ఏరియా నుండి తన కార్ లో వెళుతునడగా మార్గం మద్యలో మసీద్ దగ్గర రోడ్డు పై బైక్ నిలిపి  ఉన్న మహమ్మద్ షాహాబాజ్, అబ్దుల్ మజర్  లను బైక్ తీయమని అడుగాగ  వారిద్దరూ  సురేష్ ని భూతు మాటలు తిట్టి అతని పై బైక్ ఎత్తివేసి, రాడ్ తో తలపై కొట్టారని తెలిపారు. అదే సమయంలో అక్కడ ఉన్న ఇంకొందరు వ్యక్తులు వారిద్దరికీ సపోర్ట్ గా వచ్చి సురేష్ ని కొట్టారు అని పేర్కొన్నారు. రొయ్యల సురేష్ భార్య సౌమ్య ఇచ్చిన పిర్యాదు మేరకు మోర్తాడ్ ఎస్‌ఐ బి.విక్రమ్ కేసు నమోదు చేసి విచారణ చేసి దాడి చేసిన వారని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. నిజామాబాదు పోలీస్ కమిషనరెట్ పరిధిలో ఎవ్వరయిన భవిష్యత్తులో ఎలాంటి అల్లర్లకు,  శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించిన వారిపై పూర్తి స్థాయి ” నిఘా వ్యవస్థ” ఉంటుందని ప్రతీ ఒక్కరు తమ నడవడికను మార్చు కోవాలని, లేని యెడల వారి పై తగుచర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవ్వరికైనా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిoచడం లేదా సమాజంలో ఉద్రిక్తతలను రేపే విధంగా వ్యవహారించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ శాఖాపరంగా శాంతియుత వాతావారణం కొరకై నిర్విరామంగా కృషి జరుగుతుందని, ప్రజల సహాకారం అత్యంత ప్రధానమైనదని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిoచే వారి సమాచారం ఎవ్వరికైనా తెలిసిన మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని కోరారు.