కౌలాస్ గ్రామంలో జిల్లా జడ్పీ సీఈవో పర్యటన

  జుక్కల్, బతుకమ్మ :   జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో జిల్లా జడ్పీ సీఈవో చంద్ర నాయక్ శుక్రవారం పర్యటించి ప్రభుత్వ విద్యాసంస్థలను సందర్శించారు. ఈ సందర్భంగా జడ్పీ ఉన్నత పాఠశాల, యూపీఎస్ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి అక్కడి విద్యా బోధన, మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న సేవలను పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన చంద్ర నాయక్, భోజనం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే...