Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 September 2025, 4:00 pm Posted by : ramakrishna

సెపక్ తక్రా సీనియర్ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్లో జిల్లా మహిళల జట్టుకు ప్రథమ స్థానం

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 20 నుండి 22 వరకు జరిగిన 11 వ సెపక్ తక్రా సీనియర్ ఇంటర్ డిస్టిక్ మహిళల, పురుషుల టోర్నమెంట్లో జిల్లా మహిళల జట్టు ప్రథమ స్థానం, పురుషుల జట్టు తృతీయ  స్థానం సాధించిందని జిల్లా సేపక్  తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాదరి సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మహిళల జట్టు అత్యంత ప్రతిభ కనబరిచి లీగ్ లో వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి పై విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. సెమీఫైనల్ లో కరీంనగర్ జట్టుపై సునాయాసంగా విజయం సాధించి ఫైనల్ చేరుకుంది. ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. హైదరాబాద్ జట్టులో అంతర్జాతీయ క్రీడాకారులు ఉండటం విశేషం. అయినా ఆ జట్టును ఓడించడంపై జిల్లా అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. పురుషుల జట్టు లీగ్ లో కరీంనగర్ వరంగల్ మెదక్ పై విజయం సాధించి సెమిస్ కు చేరుకుంది. సెమీఫైనల్ లో అదిలాబాదు పై ఓడిపోయి మూడవ స్థానం కనీసం చేసుకోంది. విజయం సాధించిన క్రీడాకారులకు వనపర్తి డిఎస్పి మరియు సెపక్ తక్రా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రిక్క శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా క్రీడాకారులు బహుమతులు అందుకోవడం జరిగింది. జిల్లా జట్ల విజయంపై సెపక్ తక్రా అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు కేశవ వేణు, గాధరి సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు దీపిక, ల్యాబ్ గంగారెడ్డి, బాగా రెడ్డి సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

District women's team wins first place in Sepak Takraw Senior Inter-District Tournament