రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాట్మింటన్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

 నిజామాబాద్, బతుకమ్మ :   పోచారం గ్రామంలోని హై స్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న ఉమ్మడి జిల్లా జూనియర్ బాలుర బాల్ బ్యాట్మింటన్ శిక్షణ శిబిరంలో తుది జట్టును గురువారం ఎంపిక చేసినట్లు జిల్లా బ్యాట్మింటన్ సంఘం ప్రధాన కార్యదర్శి బి.శ్యామ్ తెలిపారు.  ఎంపికైన క్రీడాకారులు ఈనెల 4వ తేదీ నుండి 6 తేదీ వరకు ఫ్రొబేల్స్ హైస్కూల్ కామారెడ్డి జిల్లాలో నిర్వహించే 69వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ బాల్ బ్యాట్మెంటన్ క్రీడా పోటీలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు....