జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా పోలీస్ క్యాంపు కార్యాలయం, జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు అధికారులకు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల అంకితభావం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం...