కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు.మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఇటివల కార్డన్ సెర్చ్ లో పట్టుబడ్డ పత్రాలు లేని వాహనాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఇతర విభాగాలు తనిఖీ చేశారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించి శాఖపై నమ్మకాన్ని పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. నాణ్యమైన...