ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే

  ఇల్లంతకుంట, బతుకమ్మ :   రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మంగళవారం ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, శాంతిభద్రతల పరిస్థితులను సమీక్షించారు. పోలీస్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను...