Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 March 2025, 6:36 pm Posted by : ramakrishna

పట్టణ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ తనిఖీ

కామారెడ్డి, బతుకమ్మ :కామారెడ్డి జిల్లా పోలీస్ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పట్టణ పోలీస్ స్టేషన్ ను సోమవారం తనిఖీ చేశారు.
District SP inspects town police station
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, నేరాలు జరుగుతున్న తీరు, ఫిర్యాదుదారులతో ప్రవర్తించే విధానం, పోలీస్ స్టేషన్ ఆవరణను, కమాండ్ కంట్రోల్ రూం, సమస్యాత్మక, ముఖ్యమైన ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలీసుల పనితీరును మెరుగుపరుచుకునేందుకు తగు సూచనలు చేశారు. ఆయన వెంట ఏఎస్పీ చైతన్య రెడ్డి ఉన్నారు.
District SP inspects town police station