నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
బతుకమ్మ బాన్సువాడ : పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశించారు. గురువారం నస్రుల్లాబాద్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుల పట్ల వెంటనే స్పందించాలని సూచించారు. అలాగే కేసులను త్వరితగతిన పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.