దేవుని పల్లి పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
కామారెడ్డి, బతుకమ్మ : వార్షిక తనిఖీల్లో భాగంగా దేవుని పల్లి పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర బుధవారం సందర్శించి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కి చేరుకున్న ఎస్పీ కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ సిబ్బందితో చర్చించారు. ఆదేశాలు సిబ్బందికి అందరికి చేరుతున్నాయా లేదా అని ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో రికార్డ్స్ ని, పరిసరాలను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయో తెలుసుకుని...