Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 8:50 pm Posted by : ramakrishna

దేవుని పల్లి పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

వార్షిక తనిఖీల్లో భాగంగా దేవుని పల్లి పోలీస్ స్టేషన్ ని జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర బుధవారం సందర్శించి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కి చేరుకున్న ఎస్పీ కి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎస్పీ సిబ్బందితో చర్చించారు. ఆదేశాలు సిబ్బందికి అందరికి చేరుతున్నాయా లేదా అని ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో రికార్డ్స్ ని, పరిసరాలను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి నేరాలు జరుగుతున్నాయో తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు గ్రామాల్లో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని తక్షణ చర్యలను తీసుకోవాలని సూచించారు. స్టేషన్ కి వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవుని పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

 

District SP inspects Devunipalli Police Station