బాన్సువాడ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

బతుకమ్మ, బాన్సువాడ : ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. శుక్రవారం బాన్సువాడ పోలీస్ స్టేషన్​ను ఆయన తనిఖీ చేశారు. ఆస్తి సంబంధిత నేరాలపై సిబ్బందితో సమీక్షించారు. ముందుగా రోల్ కాల్‌ను పరిశీలించి, హాజరు, గైర్హాజరైన సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ఫిర్యాదులపై తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్​ ఇమేజ్  పెంచే విధంగా ప్రతీ సిబ్బంది నిక్కచ్చిగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సిబ్బంది ప్రతి ఒక్కరూ అన్నిరకాల విధులను తెలుసుకుని ఉండాలని, మారుతున్న సమాజానికి అనుగుణంగా,...