Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 9:11 pm Posted by : ramakrishna

మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

 

మాచారెడ్డి, బతుకమ్మ :

 

మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసులు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమైన ఎస్పీ, నేరాల నివారణకు అనుమానిత వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో జరిగే పరిణామాలపై ముందస్తు సమాచారం సేకరించి, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు గ్రామాల్లో ప్రజలతో మమేకమై పనిచేయడం ద్వారా పోలీస్-ప్రజా సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించే విధంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

 

District SP conducts surprise inspection of Machareddy Police Station