బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోల్‌కాల్ నిర్వహించి సిబ్బంది హాజరు, క్రమశిక్షణ, సమయపాలనపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఫిర్యాదుదారుల పట్ల గౌరవం, బాధ్యత తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లోన్ యాప్‌లు, ఆన్‌లైన్ గేమ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని హెచ్చరిస్తూ, అవి ఆర్థిక ఇబ్బందులకు దారి తీసి తీవ్ర పరిణామాలకు కారణమవుతున్నాయని పేర్కొన్నారు. వ్యక్తిగత ఆశయాలు, కుటుంబ విలువలపై దృష్టి పెట్టాలని, పిల్లల...