త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని సందర్శించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి
బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని తాండూర్ త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని కామారెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్ శనివారం సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ చరిత్రను ఆలయ కమిటీ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి ప్రాచీనమైన రాతి కట్టడమైన త్రిలింగ రామేశ్వరాలయం ఈ ప్రాంతంలో ఉండడం అనేది చాలా విశేషమని, మంజీరా నది తీరంలో వెలిసిన ఈ దేవాలయానికి ఎంతో మహిమ ఉన్నదని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆలయంలోని సూర్యకాంతి అద్భుతాన్ని చూసిన...