Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 6:10 pm Posted by : ramakrishna

త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని సందర్శించిన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని తాండూర్ త్రిలింగ రామేశ్వర ఆలయాన్ని కామారెడ్డి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్ శనివారం సందర్శించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాలయ చరిత్రను ఆలయ కమిటీ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి ప్రాచీనమైన రాతి కట్టడమైన త్రిలింగ రామేశ్వరాలయం ఈ ప్రాంతంలో ఉండడం అనేది చాలా విశేషమని, మంజీరా నది తీరంలో వెలిసిన ఈ దేవాలయానికి ఎంతో మహిమ ఉన్నదని ఆయన తెలిపారు. అదేవిధంగా ఆలయంలోని సూర్యకాంతి అద్భుతాన్ని చూసిన ఆయన దేశంలో చాలా తక్కువ దేవాలయాలలో మాత్రమే ఇలాంటి నిర్మాణ శైలి ఉంటుందని, అది మన జిల్లాలో ఉండడం మనకు గర్వ కారణమన్నారు. ఈ ఆలయాన్ని అన్ని హంగుల్లో అభివృద్ధి చేసినట్లయితే మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐకెపి ఐబి డిపిఎం సుధాకర్, ఆలయ కమిటీ అధ్యక్షులు కొమ్మ దత్తు, ఆలయ కమిటీ సభ్యులు రాజశేఖర్, వెంకన్న ఆలయ పూజారి మల్లికార్జునప్ప తదితరులు పాల్గొన్నారు.