Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2025, 7:34 pm Posted by : ramakrishna

సెపక్ తక్రా రాష్ట్ర జట్టుకు ఎంపికైనా జిల్లా క్రీడాకారులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  గోవాలో జరిగే 35వ జాతీయస్థాయి టోర్నమెంట్ కు తెలంగాణ జట్టుకు జిల్లా నుండి ముగ్గురు క్రీడాకారు ఎంపిక కావడం జరిగింది. పురుషుల విభాగంలో ఉదయ్ కుమార్, మహిళల విభాగంలో పూజిత, లాస్య ప్రియ ఎంపికైనట్లు జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాదరి సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 21,22వ తేదీలలో  వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగినటువంటి టోర్నమెంట్లో జిల్లా జట్టు మహిళల విభాగంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో జిల్లా జట్టు మూడో స్థానం తీసుకొని రాష్ట్ర జట్టుకు ఉదయ్ కుమార్ ఎంపికయ్యాడు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 23 నుంచి 27 వరకు గోవాలో జరిగే, 35వ సెపక్ తక్రా సీనియర్ నేషనల్  టోర్నమెంట్ లో పాల్గొంటారు. రాష్ట్ర జట్టుకు క్రీడాకారులు ఎంపిక పట్ల జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేశ వేణు, గాధరి సంజీవ్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు.

District players selected for Sepak Takraw state team