జన గణన స్వీయ నమోదు చేసుకున్న జిల్లా అధికారులు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జన గణన ప్రక్రియలో భాగంగా వివిధ శాఖల జిల్లా అధికారులు స్వీయ గణన ప్రక్రియలో పాల్గొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు పాల్గొన్న సందర్భంగా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ఈ మేరకు అధికారులు తమ స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తూ ఆన్ లైన్ వెబ్ సైట్ https://se.census.gov.in ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు. ...