Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 July 2025, 3:44 pm Posted by : ramakrishna

ఎరువుల గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా అధికారి

మోర్తాడ్, బతుకమ్మ: మోర్తాడ్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మోర్తాడ్ పరిధిలోని తిమ్మాపూర్, మన గ్రోమోర్ సెంటర్ మోర్తాడ్ ఎరువుల గోడౌన్లను  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవిందు  తనిఖీలు చేశారు. రైతులు లకు అవసరానికి సరిపడా యూరియా అందించడం జరుగుతుందని రైతులు ఎవరు అవసరానికి మించి యూరియా తీస్కొని కృతిమ కొరత సృష్టిచోదని తెలియజేశారు. మన జిల్లాలో వానాకాలం పంటల సాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని రైతులకు తెలిపారు. రెండు మూడు రోజుల నుంచి అధిక వర్షాలు పడుతున్నవి కావున రైతులెవరు ఎరువులు పురుగు మందులు చల్లడం గానీ పిచికారి చేయడం గాని చేయవద్దని రైతులకు అవగాహన కల్పించారు. కావున రైతులు ఎవరు యూరియా విషయంలో ఇబ్బంది పడొద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో భీంగల్ ఇన్చార్జి ఏ డి ఏ సాయి కృష్ణ, వ్యవసాయ శాఖ అధికారి హరీష్, సీఈఓ కాశీరం రైతులు తదితరులు పాల్గొన్నారు.

District officer inspects fertilizer godowns