Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 4:34 pm Posted by : ramakrishna

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన జిల్లా మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాలేక్

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను కామారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ ఖాలేక్ బాన్సువాడ, 14వ వార్డు మాజీ కౌన్సిలర్ నందు కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో బాన్సువాడ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రచార వ్యూహాలపై చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా మైనార్టీ అన్ని మతా వర్గాల మద్దతును బలోపేతం చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా అబ్దుల్ ఖాలేక్ మాట్లాడుతూ బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు అభివృద్ధి, సంక్షేమ పాలన కోసం కాంగ్రెస్ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ మహేష్ గౌడ్ పార్టీ శ్రేణులకు సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని సూచించారు.