జిల్లా మేరు సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా మేరు సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఇటీవల ఎన్నికల కోసం నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించిన విషయం తెల్సిందే. సింగిల్ డిజిట్ నామినేషన్ల దాఖలుతో ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పోస్టులు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ఉండగా బరిలో నిలిచిన వారు తప్పుకోవడంతో మిగిలిన వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి సంఘ స త్యవ్రత్ తెలిపారు. అధ్యక్షులు సోమ హనుమంతురావు, ఉపాధ్యక్షులుగా కొట్టూర్ చంద్రకాంత్,...