Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 January 2026, 9:03 pm Posted by : ramakrishna

జిల్లా మేరు సంఘం ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తి

. . . 12న నామినేషన్ల ఉపసంహరణ

 

. . . 18న జిల్లా కార్యవర్గ ఎన్నికలు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా మేరు సంఘం ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ శనివారం ముగిసింది. ఈ నెల 9,10వ తేదిల్లో నామినేషన్లు స్వీకరించారు. ఈ నెల 11న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ఉంది. శనివారం వరకు జరిగిన నామినేషన్ల స్వీకరణలో ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పదవులకు సింగిల్ డిజిట్ నామినేషన్లు దాఖలు కావడంతో ప్రధాన కార్యదర్శిగా దర్భాసు శ్యాం, కోశాధికారి కొక్కు రాజేశ్వర్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు సంగ సత్యవ్రత్, బుర్రసాయిబాబా, రాయల్ వార్ లక్ష్మీకాంత్, యెన్ను సూర్యప్రకాష్ లు తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా సోమ హనుమంతురావు, గట్ల సురేష్ లు నామినేషన్లు వేయగా ఉపాధ్యక్షులుగా కొట్టూర్ చంద్రకాంత్ దీకొండ సుధీర్, కొట్టూర్ శ్రీనివాస్ లు నామినేషన్లు వేశారు. సంయుక్త కార్యదర్శులుగా తాళ్ళ నర్సింలు (రిటైర్డ్ ఎస్సై), గట్ల నరేందర్(గడ్డం), నరేందర్ (బోధన్)లు నామినేషన్లు వేశారు. ఈ నెల 12న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 13 నుంచి 17 వరకు అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. ఈ నెల 18న జిల్లా మేరు సంఘంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కంపు జరిపి తుది ఫలితాలు ప్రకటిస్తారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

District Meru Sangam election nomination process complete