మాతృ మరణాల నివారణపై జిల్లా వైద్యశాఖ సమీక్ష
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మాతృ మరణాల నివారణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారిణి డాక్టర్ బి.రాజశ్రీ మాట్లాడుతూ ప్రతి గర్భిణీని 12 వారాల్లోపు నమోదు చేసి, కనీసం నాలుగు సార్లు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రమాదకర లక్షణాలున్న గర్భిణీలను ప్రత్యేకంగా గుర్తించి, అవసరమైన చికిత్సలు అందించాలని ఆదేశించారు. గర్భిణీలకు హెచ్‌బి, బీపీ, రక్తహీనత, హైపర్‌టెన్షన్ తదితర పరీక్షలు నిర్వహించి ముందస్తు ప్రణాళికతో వైద్య సేవలు అందించాలని...