నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా జన విజ్ఞాన వేదిక మల్లు స్వరాజ్యం ట్రస్టు, ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సైన్స్ సంబరాలు పోస్టర్ ని బుధవారం నిర్మల హృదయ పాఠశాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఫిబ్రవరి 25 నాడు నిర్మల హృదయ పాఠశాలలో నిరహించే జిల్లా స్థాయి సైన్స్ పోటీలను జయయప్రదం చేయాలన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, డ్రయింగ్. ఉపాధ్యాయులకు ఉపాన్యాస పోటీలు ఉంటాయాన్నారు, గెలుపొందిన వారికి క్యాష్ ప్రైజ్ తో పాటు మెమంటోస్ ఉంటాయాన్నారు. ప్రతి స్కూల్ నుండి పోటీకి ఒక్కరు చొప్పున పంపాలన్నారు. ఛీఫ్ గెస్ట్ గా డీఈఓ. అశోక్ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్రా రామారావు, జయని నెహ్రు, రామ్మోహనరావు కొయేడి నర్సింలు గౌడ్, ప్రసాదరావు, శ్రీనివాస్, రామకృష్ణ, నిర్మల్ హృదయ స్కూల్ హెచ్ఎం, సూరి, ఈవీఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.