నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎనిమిదవ జాతీయ పోషణ మాసం సందర్బంగా జిల్లా స్థాయి పోషణ మాసం కార్యక్రమాన్ని మోటాటి రెడ్డి ఫంక్షన్ హాల్ గుండారం నిజామాబాద్ నందు జిల్లా సంక్షేమ అధికారి యస్ కే రసూల్ బీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పోషకాహారా వంటకాల ప్రదర్శన నిర్వహించారు. సామూహిక శ్రీమంతాలు, అక్షరాబ్యాసం, వంటలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం యం యల్ ఏ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాదు రూరల్ నియోజకవర్గం యం యల్ ఏ భూపతి రెడ్డి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అంకిత్, నిజామాబాదు అర్బన్ రూరల్ సీ డి పి వో లు సౌందర్య, జ్యోతి, సూపర్ వైజర్ లు అంగన్వాడీ టీచర్ లు, గర్భవతులు, తల్లులు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
