Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2025, 7:14 pm Posted by : ramakrishna

జిల్లాస్థాయి ఎఫ్ఎల్ఎన్ టీఎల్ఎం మేళా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాస్థాయి ఎఫ్ఎల్ఎన్ టీఎల్ఎం మేళ  హెచ్పీఎస్ పాఠశాల చంద్రశేఖర్ కాలనీ లో జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ ) కిరణ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. మండల స్థాయిలో ఎంపిక కాబడి జిల్లా స్థాయికి వచ్చినటువంటి 330 టిఎల్ఎం లను విషయ నిపుణులైన ఎంఈఓ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జూరి కమిటీ పరిశీలించి విజేతలను నిర్ణయించారు. ఒక్కొక్క టిఎల్ఎం పాఠశాల స్థాయిలో ఏ విధంగా విద్యార్థులకు అమలు పరుస్తారో వాటి ద్వారా పిల్లల సామర్థ్యాలను ఏ విధంగా అభివృద్ధి పరుస్తారో ఉపాధ్యాయులతో  చర్చించి సంతృప్తిని వ్యక్తపరిచారు. అదేవిధంగా ఈ కృత్యాలను పాఠశాల స్థాయిలో అమలుపరిచి ప్రతి విద్యార్థి చదవడం, రాయడంలో ముందంజలో ఉండేటట్టు కృషి చేయాలన్నారు. ఈ సందర్బంగా ముఖ్య అతిధి కిరణ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్, అకాడమిక్ మానిటరింగ్ అధికారిబాలకృష్ణ సంయుక్తంగా మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో అభ్యసన బోధనలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించి విద్యార్థులలో సబ్జెక్టు కు సంబంధించిన సామర్ధ్యాలను అలాగే అభ్యసన ఫలితాలు రాబట్టే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని అన్నారు. ఈరోజు ప్రదర్శించిన కృత్యాల ద్వారా పిల్లలలో సామర్ధ్యాలను సాధించడానికి సులువుగా ఉపయోగపడతాయని  కావున వీటిని తరగతి బోధనలో ఉపయోగించుకోవాలని సూచించారు. జిల్లాస్థాయి ఎఫ్ఎల్ఎన్ టీఎల్ఎం మేళాలో 330 ప్రదర్శనలు ప్రదర్శించగా అందులో నుండి ఎనిమిదింటిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్ లు అందజేశారు. సర్టిఫికెట్, మెమెంటో తో డీఈఓ సత్కరించి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు తెచ్చిపెట్టేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో ఎంఈఓ లు నారాయణ గౌడ్, సేవాలా, సాయరెడ్డి, హెచ్పీఎస్ కరెస్పాండెంట్ సందీప్, ప్రణయ్, సీఎంఓ శ్రీనివాస్ రావు ఆర్గనైజయింగ్ కమిటీ సభ్యులు జె.శంకర్, సురేష్ గంగకిషన్ తదితరులు పాల్గొన్నారు.District level FLN TLM Mela