జిల్లాస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం

బాన్సువాడ, బతుకమ్మ: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సోమవారం జిల్లా స్థాయి సీఎం క్రీడా పోటీలను రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని భావించి క్రీడాకారులకు మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పించేందుకు రూ.200కోట్లు బడ్జెట్ లో కేటాయించారన్నారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని...