జిల్లా స్థాయి బీసీ గురుకుల క్రీడా పోటీలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కంజరలోని మహాత్మ జ్యోతిబా పూలే వెనుక బడిన తరగతుల సంక్షేమ పాఠశాలలో అండర్ 14, 19 ఆటల పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయని ఆర్సీఓ సత్యనాథ్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలలోని వివిధ బీసీ గురుకుల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని అన్నారు. ఈ పోటీల్లో వివిధ బీసీ గురుకుల పాఠశాలల పీఈటీలు, విద్యార్థులు, పీడీలు పాల్గొన్నారు.